- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో భారీగా గో మాంసం పట్టివేత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్
విశాఖలో భారీగా గోమాంసం నిల్వలు లభ్యమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో భారీగా గోమాంసం నిల్వలు లభ్యమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఇటీవల మిత్రా కోల్డ్ స్టోరేజీలో1.89 లక్షల కేజీల గోమాంసం పట్టుబడింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆయన.. విశాఖ సీపీకి ఫోన్ చేసి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనివెనుక ఉన్నదెవరైనా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గోమాంసం నిల్వల వెనుక ఉన్న అసలు మూలాలను గుర్తించి కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామని సీపీ వివరించారు.
అక్రమ గోవధ, గోమాంసం సరఫరా, ఎగుమతులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురంలో అక్రమంగా నిర్వహిస్తోన్న జంతు వధశాల గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే మూసివేయించామని గుర్తుచేశారు.






