- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు లేకపోతే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దళేం: పవన్ కల్యాణ్
సీఎం చంద్రబాబు లేకపోతే ఆర్థిక పరిస్థితి చక్కదిద్దే వాళ్లు ఉండరని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) లేకపోతే ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేవాళ్లు ఉండరని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారు. మార్కాపురం పర్యటనలో రాష్ట్రాభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ పార్టీ, కూటమి కంటే ప్రజలే ముఖ్యమని చెప్పారు. తనకు అనుభవం లేదని.. ఆయన వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 15 ఏళ్లు సుస్థిర పాలన ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. లేకపోతే ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేవాళ్లు ఉండరన్నారు. తనకు పోరాడే శక్తి ఉన్నా.. అనుభవం లేదన్నారు. అందుకే 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అన్ని వేళ్లు ఒకలా ఉండవని, కానీ అన్ని వేళ్లూ కలిస్తేనే పిడికిలి అవుతుందన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.






