- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు: లిక్కర్ కేసుపై పవన్ రియాక్షన్
ఏపీ లిక్కర్ కేసులో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. ఈ కేసులో బిగ్ బాస్ పాత్రపై కేబినెట్‌లో చర్చించి స్పందిస్తానని ఆయన తెలిపారు. లిక్కర్ కేసు అక్రమమని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై పవన్ కల్యాణ్ స్పందించారు. కల్తీ మద్యం తాగి చాలా మంది చనిపోయారని చెప్పారు. మద్యపాన నిషేధం చేస్తామని, రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌ను పారించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు తప్పు చేయకపోతే నిరూపించుకోవాలని చెప్పారు. తప్పు చేస్తే కేసులు పెట్టకూడదని ప్రధాని మోడీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి కొత్త రూల్స్ తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవద్దని అనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం(Liquor)లో వైసీపీ(Ycp) నేతలు అవకతవకలకు పాల్పడ్డారని, తిరిగి దబాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. లిక్కర్ అమ్మకాల్లో దాదాపు రూ. 3,500 కోట్లు దారి మళ్లినట్లు అభియోగాలున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.






