నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదు: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...

నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు చర్చ జరగలేదు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సోదరుడు, జనసేన పార్టీ నేత నాగబాబు(Nagababu)కు మంత్రి పదవి అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ పదవి దక్కకపోవడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు.

‘‘నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకూ చర్చజరగలేదు. సీఎం చంద్రబాబు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారు.ఇక నేనే నిర్ణయం తీసుకోవాలి. రాజకీయాల్లో కొన్న ఇబ్బందులు ఉంటాయి. ఆగస్టులో మంత్రి వర్గ విస్తరణపై ఆలోచన చేస్తాం. ప్రస్తుతం జనసేన(Janasena)ను గ్రౌండ్ లోనూ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. పట్టున్న ప్రాంతాల్లోనూ పార్టీని పటిష్టం చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించాం.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story