కుట్రలతో ఉద్రిక్త పరిస్థితులు.. పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన.. కీలక సందేశం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-13 13:47:49  IST  )

ప్రజల మధ్య ఘర్షణలు, వైషమ్యాలకు కుట్రలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కుట్రలతో ఉద్రిక్త పరిస్థితులు..  పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన.. కీలక సందేశం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రజల మధ్య ఘర్షణలు, వైషమ్యాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనల దృష్ట్యా ఆయన స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సందేశాన్ని ఇచ్చారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర మార్గాలో కులాలు, మతాల మధ్య కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, పదేళ్లుగా ఇలాంటివి చూస్తున్నామని, అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండగాలని, ప్రజలు, కార్యకర్తలు ఎలాంటి ఆవేశాలకు పోవద్దని, ఘర్షణలు, దాడులకు దిగవద్దని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.

ఉదాహరణకు కృష్ణా జిల్లాలో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేశారు. మచిలీపట్నంలో ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడటం వల్ల ఎంతకు దారి తీసిందో గమనించాలని పేర్కొన్నారు. ఇలాంటి కుట్రలను ముందుగానే పసిగట్టి చట్టపరంగా చర్యలు తీసుకువాలి తప్ప...ఎలాంటి ఘర్షణలకు దిగొద్దని చెప్పారు. అలాగే మచిలీపట్నం ఘటనపై పార్టీలో చర్చ జరగాలని.. దాడికి పాల్పడిన వివరాలు తీసుకుని నోటీసులు ఇవ్వాలని స్థానిక పార్టీ నేతలను పవన్ కల్యాణ్ ఆదేశించారు.

పవన్ కల్యాణ్ ట్వీట్...

Next Story