సలహాలు ఇవ్వడంపై నమ్మకంలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-13 10:38:09  IST  )

సలహాలు ఇవ్వడంపై తనకు నమ్మకం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తమిళనాడులో హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేళ తనను సలహాలు ఇవ్వాలంటూ వచ్చిన అభ్యర్థనపై ఆయన స్పందించారు..

సలహాలు ఇవ్వడంపై నమ్మకంలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెడ్ డెస్క్: సలహాలు ఇవ్వడంపై తనకు నమ్మకం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawankalyan) అన్నారు. తమిళనాడు(Tamil Nadu)లో హీరో విజయ్(Hero Vijay) టీవీకే(TVK) పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వేళ తనను సలహాలు ఇవ్వాలంటూ వచ్చిన అభ్యర్థనపై ఆయన స్పందించారు. విజయ్‌కు సలహా ఇవ్వనని, అలాంటి వాటిని తాను అసలు నమ్మనని చెప్పారు. కాగా ఏపీలో హీరో పవన్ కల్యాణ్ కూడా రాజకీయ అడుగులు వేసి జనసేన పార్టీ స్థాపించి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో సాటి నటుడిగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న హీరో విజయ్‌కు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చుగా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. తనకు సలహాలు ఇవ్వడంపై నమ్మకం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story