- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ భూమి వాళ్లదే: కేటీఆర్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందన
తెలంగాణలో ఇంకా ప్రాంతీయ నినాదం, ఉనికి ఉందని, ఏపీలో మాత్రం ఆంధ్ర అనే ఉనికి లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో పోటీపై ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవన్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇంకా ప్రాంతీయ నినాదం, ఉనికి ఉందని ఏపీలో మాత్రం ఆంధ్ర అనే ఉనికి లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో పోటీపై ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవన్నారు. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదని తెలిపారు. తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమి పుత్రులదేనని స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు సోదురుడిలాంటివారని చెప్పారు. ప్రాంతీయవాదం వేరని, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరన్నారు. రాష్ట్రాలు విభజించుకుంటూ వెళితే ఎక్కడికి వెళతామన్నారు. భూమికి పరిహద్దులు ఉంటాయని, మనసుకు ఉండదన్నారు. ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడంలేదన్నారు. జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారని తెలిపారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా ఎవరి వ్యవహరించకూడదని పవన్ కల్యాణ్ తెలిపారు.
రాజకీయాల్లో కుల దూషణలు
ఏపీ రాజకీయాల్లో కుల దూషణలు ఎక్కువయ్యాయని ఆయన తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది పరాకాష్టకు చేరిందన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే కులం పేరుతో దూషించడం మొదలుపెట్టారని చెప్పారు. అధికారం పోయిన తర్వాత ఇది మరీ పెరిగిపోయిందన్నారు. కుల దూషణలకు ముగింపు పలకాలని జనసేన నిర్ణయించిందన్నారు. ఇందుకోసం సేనాగళం అనే కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇదే తరహా విధానం కొనసాగితే పాలించడం చాలా కష్టతరమవుతుందని హెచ్చరించారు. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగంతోనే బాషాప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు జరిగాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.






