- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశం
తిరుపతి(Tirupati) నగర వనంలో చెట్ల నరికివేతపై ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) నగర వనంలో చెట్ల నరికివేతపై ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. నిన్న(శనివారం) దివ్యారామంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికి వేసినట్టు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం(AP Government) స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్యారామంలో చెట్లు నరికివేత సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని గుర్తించారు.
ఈ ఘటన పై పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందిస్తూ.. సరిహద్దు కంచె ధ్వంసం అవ్వడంతో వన్యప్రాణులు నీరు, తిండి కోసం బయటకు వస్తూ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నాయని సోషల్ మీడియా(Social Media)లో వచ్చిన సమాచారం పై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని సూచించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయి విచారణకు అటవీ శాఖ ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావును నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.






