పల్లె పండుగ 2.0పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

పల్లెల్లో నిర్మించే రోడ్ల సమాచారం ప్రతి ఒక్కరికీ తెలిసేలా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నాట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

పల్లె పండుగ 2.0పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లెల్లో నిర్మించే రోడ్ల సమాచారం ప్రతి ఒక్కరికీ తెలిసేలా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నాట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. శుక్రవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పల్లెపండుగ 2.0, అడవితల్లి బాట పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై ఆయన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల శాఖలు, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాస్కీ నిధులతో పల్లెపండుగ 2.0ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడంతో పాటు గుంతలు లేని రోడ్లను అందుబాటులో ఉంచాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఉపాధి హామీ పథకం నిధులు, పీఎం జన్ మన్ తో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ సహాయం కలిపి మొత్తం రూ.1158 కోట్లు అందుబాటులో ఉన్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులను నిర్మించాలని, వాటి నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి, సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నాణ్యతా ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు.

Next Story