- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Super Six.. Super Hit Sabha: రాయలసీమ అభివృద్ధిపై పవన్ కీలక వ్యాఖ్యలు
రాయలసీమఅభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ(Rayalaseema) అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం(Ananthapur)లో నిర్వహించిన సూపర్ 6... సూపర్ హిట్ (Super 6.. super Hit) సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రస్తావన తీసుకొచ్చారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పారు. కూటమి నాయకులంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులు పీడుస్తున్నాయని, అయినా సరే సూపర్ 6 హామీలను నెరవేర్చామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని చెప్పారు. ఒకే రోజులో గ్రామ సభలు నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచామన్నారు. చట్ట పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.






