Janasena:ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by Jakkula.Mamatha |

భారత్-పాక్ యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంతంగా రూ.25 లక్షలు అందజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే

Janasena:ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్-పాక్ యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంతంగా రూ.25 లక్షలు అందజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మురళి నాయక్ అంత్యక్రియలు సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇవాళ(శనివారం) వీరజవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులకు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(తిరుపతి), నిమ్మల జయకృష్ణ(పాలకొండ) అహుడ చైర్మన్ TC వరుణ్‌తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పలువురు జనసేన ముఖ్య నేతలు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు.

ఈ క్రమంలో మురళీనాయక్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్యేల చేతులమీదుగా మురళి నాయక్ తల్లిదండ్రులకు చెక్కు రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మురళి నాయక్ తల్లిదండ్రుల క్షేమ సమాచారాలు జనసేన నాయకులు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. కూటమి ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను మీరు ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు చెప్పారు. యావత్‌ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్‌ దేశం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యేలు అన్నారు.

Next Story