- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోస్తా గ్రీన్ బెల్ట్‌పై పవన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఏపీ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను డెవలప్‌మెంట్ చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధి(Ap Devolepment)పై కూటమి ప్రభుత్వం(Aliance Government) కీలక అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతి(Amaravati)తో పాటు అన్ని ప్రాంతాలను డెవలప్‌మెంట్ చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(MInister Nara Lokesh) నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో తీర ప్రాంతం చాలా పొడవున ఉండటంతో ఆయా ప్రాంతాల్లో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బీచ్ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృడంగా కల్పించింది. ఇందులో భాగంగా నిధులను సైతం ఖర్చు పెడుతోంది.
కోస్తా గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం ఫోకస్
ఇక కోస్తా గ్రీన్ బెల్ట్(Coasta Green Belt)ను సైతం శరవేగంగా అభివృద్ధి చేసేందుకు అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం నడుంబిగించారు. ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. కోస్తా గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై చర్చించారు. తీర ప్రాంతాల్లో హరిత వలయాలు విస్తరించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాదు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అంతేకాకుండా సామాజిక అడవుల పెంపుపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.






