పీసీబీ అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్.. చర్యలకు ఆదేశం

by Vemula.Srinu Prasad |

గోదావరి నదిని అత్యంత పవిత్రంగా భావించే కోట్ల మంది భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, నదీ పరివాహక ప్రాంతాల పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ...

పీసీబీ అధికారులపై పవన్ కల్యాణ్ సీరియస్.. చర్యలకు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: గోదావరి నది(Godavari River)ని అత్యంత పవిత్రంగా భావించే కోట్ల మంది భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, నదీ పరివాహక ప్రాంతాల పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారు. రాబోయే గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu) ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నదిని స్వచ్ఛంగా ఉంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. నదీ జలాల కాలుష్య నియంత్రణపై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన గోదావరి నదిలోకి మురుగునీరు, పరిశ్రమల వ్యర్థాలు కలవకుండా చూడటంలో అధికారులు విఫలమవడంపై ఆయన మండిపడ్డారు. పర్యావరణ పరిరక్షణ, నది స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అధికారులను పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

అధికారులపై చర్యలకు ఆదేశం

పర్యావరణ నియమాలను బేఖాతరు చేస్తూ, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు తక్షణమే క్షేత్రస్థాయిలో కఠినమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పుష్కరాల నాటికి భక్తులకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Next Story