ఏపీలో మరో సంచలనం.. వాళ్ల కోసం స్వయంగా రంగంలోకి పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-18 15:49:00  IST  )

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..

ఏపీలో మరో సంచలనం.. వాళ్ల కోసం స్వయంగా రంగంలోకి పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భూ బాధితుల(Land Victims) కోసం స్వయంగా రంగంలోకి దిగనున్నారు. అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌(Teleconference)లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను జిల్లాల పర్యటన చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూదందాల బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తానని తెలిపారు. అంతేకాదు ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. కూటమి పాలన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగుతోందన్నారు. ప్రజలను ఇబ్బందిపెడితే కూటమినేతలనూ ఉపేక్షించనని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

కాగా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. సవర్థవంతంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. రాజకీయాలకంటే ప్రజా సేవకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజల నుంచి తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారు. మంగళగిరి జనసేన కార్యాలయం వేదికగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తక్షణమే పరిష్కారం చూపుతున్నారు. అయితే ఇటీవల కాలంలో భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలు రాష్ట్రం నలుమూలుల నుంచి వస్తున్నాయి. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులు వచ్చి కలిస్తేనే ఇప్పటి వరకు అర్జీలు స్వీకరిస్తున్నారు. ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. అలాగే కబ్జాలకు పాల్పడిన ఎవరినైనా సరే శిక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారులతో జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. భూ బాధితులకు జరిగిన అన్యాయాలపై తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Next Story