- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News: పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ సీఎం(Deputy Cm) మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలను ఫిర్యాదుల రూపంలో స్వీకరించి వాటికి పరిష్కారం చూపిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇక నుంచి మేరుగా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్-ప్రైవేటు-పంచాయతీ-పార్టనర్‌షిప్(Public-Private-Panchayat-Partnership) కార్యక్రమంలో భాగంగా గ్రామాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో మాట్లాడేందుకు స్థానిక సినిమా హాళ్లను వాడుకోవాలని నిర్ణయించారు. తొలి దశలో రాష్ట్రంలో కొన్ని గ్రామాల ప్రజలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడనున్నారు. ప్రభుత్వ సేవలు, సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.






