మళ్లీ జనాల్లోకి పవన్ కల్యాణ్ .. రాజమండ్రి షెడ్యూల్ ఇదే..!

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల ఆయనకు ఒక చిన్న శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సూచన మేరకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు...

మళ్లీ జనాల్లోకి పవన్ కల్యాణ్ .. రాజమండ్రి షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) స్వల్ప అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల ఆయనకు ఒక చిన్న శస్త్రచికిత్స జరగడంతో వైద్యుల సూచన మేరకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రాజమండ్రికి పవన్

పవన్ కల్యాణ్ తాజా షెడ్యూల్ ప్రకారం ఆయన ఆదివారం రాజమండ్రి(Rajahmundry)లో పర్యటించనున్నారు. రేపు సాయంత్రానికి ఆయన రాజమండ్రి చేరుకుని, అక్కడే రాత్రికి బస చేయనున్నారు. డిప్యూటీ సీఎం రాకను పురస్కరించుకుని స్థానిక అధికారులు, కూటమి నాయకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై పరిశీలన

ఈ పర్యటనలో భాగంగా సోమవారం నాడు గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu) ముందస్తు ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల నిర్మాణం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పవన్ కల్యాణ్ మళ్లీ జనాల్లోకి వస్తుండటంతో అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

Next Story