- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూటమికి విఘాతం కలిగించొద్దు: డిప్యూటీ సీఎం పవన్
కూటమి ఐక్యతకు విఘాతం కలిగేలా ఎవరూ ప్రవర్తించొద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.....

దిశ, వెబ్ డెస్క్: కూటమి ఐక్యతకు విఘాతం కలిగేలా ఎవరూ ప్రవర్తించొద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అధ్యక్షతన అమరావతి(Amaravati)లో జరిగిన ఎన్డీఏ(NDA) శాసనసభా పక్ష సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు కూటమి నేతల్లో ఎలాంటి స్పూర్తి కనిపించిందో ఇప్పుడూ అదే కొనసాగించాలని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రం బాగు కోసమే దుర్గార్మపు పాలనను అంతమొందించామని, అప్పుడు ఎలా అయితే కలిసి పని చేశామో ఇప్పుడూ అలాగే కొనసాగాలన్నారు. మరో ఐదేళ్ల పాటు కూటమి నేతలు ఐక్యంగా పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) నేతల్లో మార్పు రాలేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ కుట్రలు చేస్తోందని, కూటమి నేతలంతా దీటుగా తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.






