‘ఇండియన్ టైగర్‌’గా పవన్ కల్యాణ్‌కు బిరుదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-11 12:44:37  IST  )

పీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అరుదైన ఘనత సాధించారు....

‘ఇండియన్ టైగర్‌’గా పవన్ కల్యాణ్‌కు బిరుదు
X

దిశ, వెబ్ డెస్క్/ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము(Ancient Japanese swordsman) కళ అయిన ‘కెంజుట్సు’(Kenjutsu)లో ఆయన అధికారికంగా ప్రవేశం పొందారు. దీంతో జపనీస్ మార్షల్ ఆర్ట్స్(Japanese martial arts) చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు “ఇండియన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది.

సిద్ధిక్ మహ్మూదీ వద్ద శిక్షణ

భారతదేశంలో జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యులలో ఒకరైన హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కల్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో కెండోలో ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం, లోతైన తాత్విక అవగాహనను సంపాదించారు. ఈ ఘనతతో సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేసిన కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో పవన్ కల్యాణ్ ఒకరిగా నిలిచారు. యుద్ధకళ సాధకులు, అభిమానుల దృష్టిలో కెంజుట్సులో ఆయన ప్రవేశం కేవలం గౌరవం మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసంతో నిండిన జీవిత ప్రయాణానికి ప్రతిబింబంగా భావిస్తున్నారు.

మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్

మూడు దశాబ్దాలకు పైగా ఆయన కొనసాగించిన క్రమశిక్షణ, సాధన, పరిశోధనకు ఈ బిరుదు ప్రతీకగా నిలిచింది. పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌లో చేసిన నిరంతర కృషిని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు ఆయనను పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలతో సత్కరించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (5వ డాన్) పురస్కారం లభించింది. అలాగే, జపాన్ వెలుపల నుంచి ‘సోకే మురమత్సు సెన్సై’ ఆధ్వర్యంలోని టకెడా షింగెన్ క్లాన్‌లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ క‌ల్యాణ్ చరిత్ర సృష్టించారు.

సినీ రంగంలోనూ తనదైన ముద్ర

కాగా సినీ రంగంలో నటుడిగా తనదైన ముద్ర వేసిన పవన్ కల్యాణ్, రచయిత, దర్శకుడు, స్టంట్ కోఆర్డినేటర్, కొరియోగ్రాఫర్, గాయకుడిగా కూడా ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజా నాయకుడిగా విశేష ఆదరణ పొందుతున్నారు. సినిమాలు, రాజకీయాల్లోకి రాకముందే పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. చెన్నైలో ఉన్న సమయంలో కరాటే సహా పలు యుద్ధకళల్లో కఠిన శిక్షణ తీసుకుంటూ, సాంకేతికంగా బలమైన పునాది వేసుకున్నారు. అనంతరం జపనీస్ సమురాయ్ సంప్రదాయ యుద్ధకళలపై లోతైన అధ్యయనం చేసి, శారీరక సాధనతో పాటు తాత్విక అవగాహనను కూడా పెంపొందించారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన ఆసక్తి సినిమాల్లోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల్లో యుద్ధకళల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇస్తూ, వాటికి ప్రజాదరణ తీసుకొచ్చారు.

READ MORE ....

త్వరలో తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటన: అధికారికంగా ప్రకటించిన JSP

Next Story