- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో షాక్.. రేపు విచారణ
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని.. మంత్రిగా ఉంటూ సినిమా(Movies)ల్లో నటిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల(ఆగస్టు) 19వ తేదీన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వాహనాలు, భద్రతా సిబ్బందిని సినిమా కార్యక్రమాలకు ఉపయోగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు రేపు(సోమవారం) విచారణ జరపనుంది.
ఇదిలా ఉంటే.. ఈ విషయం పై గత నెలలో హైకోర్టు ముందుకు వచ్చిన విచారణలో రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందించారు. ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యం పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ జోతిర్మయి ప్రతాప సీబీఐ, ఏసీబీ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో (కాజ్‌లిస్ట్) పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.






