- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ.. ఉపాధి సిబ్బందికి భారీ ఊరట

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురైన 36 మంది ఉపాధి సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఊరట కల్పించారు. ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం(Panchayati Raj Engineering Department)లో పని చేసిన కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు వారికి జీతాలు కూడా నిలిపివేసింది. దీంతో ఎన్నో సార్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.
దీంతో వెంటనే వారి సమస్యలను పవన్ పరిష్కరించారు. పీఆర్ ఇంజనీరింగ్, ఈఎస్సీ కార్యాలయాల్లో పని చేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలుత 519 మందిని, ఆ తర్వాత మరో 38 మందికి ఉద్యోగాలు కల్పించారు. అయితే మరో 36 మందికి తక్కువ అర్హతలు ఉండటంతో పోస్టులు పొందలేకపోయారు. తాజాగా వారికి ఆఫీసు అసిస్టెంట్లుగా ఉద్యోగ అవకాశం కల్పించారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఉపాధి సిబ్బంది(Employment staff) ధన్యవాదాలు తెలిపారు.