మన విశ్వాసాన్ని దెబ్బతీశారు.. కల్తీ నెయ్యి ఘటనపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-24 09:53:27  IST  )

కల్తీ నెయ్యి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

మన విశ్వాసాన్ని దెబ్బతీశారు.. కల్తీ నెయ్యి ఘటనపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్
X

దిశ వెబ్ డెస్క్: గత ప్రభుత్వం మన విశ్వాసాన్ని దెబ్బతీసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి(Tirumala adulterated ghee) ఘటనపై ఆయన సంచలన ట్వీట్ చేశారు. తిరుమల కేవలం ఆలయం కాదని, భక్తికి మూలమని, ప్రగాఢ విశ్వాసంతో అక్కడికి వెళ్తామని ఆయన చెప్పారు. 2019–24 అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. ప్రతిరోజూ 60 వేల మంది భక్తులు తిరుమలేశుడిని సందర్శించారన్నారు. సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పరిశ్రమల దిగ్గజాలు, క్రీడాకారులు, కళాకారులు, సాహిత్య ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని పవన్ పేర్కొన్నారు.కానీ గత ప్రభుత్వంలో TTD బోర్డు, అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. మన భక్తికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ఒక అవకాశం ఇచ్చి ప్రతి ఒక్క భక్తుడు మోసపోయాడన్నారు. తిరుమల నియమాలను ఉల్లంఘించారని వైసీపీపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Next Story