సినీ నటి కృష్ణవేణి పట్ల DCM పవన్ కల్యాణ్ సంతాపం

by Gantepaka Srikanth |

సీనియర్ ఎన్టీఆర్‌(Sr.NTR)ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూసిన విషయం తెలిసిందే.

సినీ నటి కృష్ణవేణి పట్ల DCM పవన్ కల్యాణ్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ ఎన్టీఆర్‌(Sr.NTR)ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కృష్ణవేణి(Krishnaveni) ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తాజాగా.. కృష్ణవేణి మృతి పట్ల జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన శ్రీమతి కృష్ణవేణి గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా శ్రీమతి కృష్ణవేణి గారు బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు. శ్రీ ఎన్టీఆర్, శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీమతి కృష్ణవేణి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story