AP News:ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్..!

by Jakkula Mamatha |   ( Updated:2024-07-03 15:57:08.0  )
AP News:ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. నేడు మూడోసారి జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో పవన్‌పై స్థానికులు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. వాకతిప్ప ఫిషింగ్ హార్బర్, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడ లో కోతకు గురైన తీరప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ పరిశీలించారు. తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ రోజు సాయంత్రం పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రసంగం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం.

Read more...

‘పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నాను’..పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Advertisement

Next Story