కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |   (  Updated:2025-11-09 08:57:16  IST  )

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో (Palamaner) ఉన్న కుంకీ ఏనుగుల క్యాంప్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రారంభించారు.

కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లాలోని పలమనేరులో (Palamaner) ఉన్న కుంకీ ఏనుగుల క్యాంప్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులు కృష్ణ, అభిమన్యులకు ఆహారాన్ని అందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైల్డ్ లైఫ్ (హనుమాన్) కార్యక్రమానికి సంబంధించిన పోస్టరును డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఇందులో పదకొండు అంశాలను పొందుపరిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

నిర్ణీత వ్యవధిలో హనుమాన్ (Hanuman) లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని డిప్యూటీ సీఎం అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. నవంబరు 18, 19 తేదీల్లో హనుమాన్ కార్యక్రమ విషయమై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవనం శాఖల అధికారులు సమావేశానికి హాజరు కావాలని స్పష్టం చేశారు.

Next Story