Pawan Kalyan:సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు

Pawan Kalyan:సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం.. కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని భారీ కేక్ కటింగ్స్ నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. సీఎం చంద్రబాబు 1950 ఏప్రిల్ 20న జన్మించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునరుజ్జీవింపచేయడం సీఎం చంద్రబాబు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం అన్నారు.

అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా చంద్రబాబు నాయుడు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ అన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సీఎం చంద్రబాబు సంపూర్ణ ఆయుషును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story