- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స.. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ల సూచన
డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన.. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని, వైద్యుల సూచన మేరకు వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు ఎంఆర్‌ఐ (MRI) సహా పలు పరీక్షలు నిర్వహించి, పరిస్థితిని బట్టి తక్షణమే శస్త్రచికిత్స పూర్తి చేశారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ కోలుకుంటున్నారని, అయితే ఆయనకు కనీసం వారం నుంచి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు ఆయన రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ వెల్లడించారు. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో స్వస్థత చేకూర్చుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు.






