నేడు విశాఖపట్నంలో పర్యటించనున్న ఉపముఖ్యమంత్రి

by Thanuru Gopichand |

​ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నేవీ డే (Navy Day) వేడుకలను భారత నౌకాదళం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

నేడు విశాఖపట్నంలో పర్యటించనున్న ఉపముఖ్యమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ​ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నేవీ డే (Navy Day) వేడుకలను భారత నౌకాదళం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా ఈ ఏడాది కూడా నేవీ డే వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ క్రమంలో భారత నౌకాదళం ప్రతిష్టాత్మకంగ నిర్వహించే నేవీ డే వేడుకల ముందస్తు కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరుకానున్నారు. అందులో భాగంగా నేడు ఆయన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నేవీ డే సందర్భంగా నిర్వహించనున్న సన్నాహాక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారని సమాచారం. అక్కడి నుంచి ఆయన షీలానగర్ మారుతీ కూడలి మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ (Eastern Naval Command - ENC) ప్రధాన కార్యాలయానికి పయనం కానున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఐఎన్ఎస్ సముద్రికలో జరిగే నేవీ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. ​ఈ సందర్భంగా భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు, పోరాట పటిమను ప్రదర్శించే పలు ప్రత్యేక విన్యాసాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొననుండటంతో అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. వీటికి తోడు, నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో ఆయన సమావేశమయ్యే అవకాశం కూడా ఉందని తెలియ వస్తోంది. ​విశాఖలో నేవీ డే వేడుకలు ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఈ కీలకమైన ముందస్తు కార్యక్రమాలకు హాజరు కావడం విశాఖ వాసుల్లో, ముఖ్యంగా యువతలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఉపముఖ్యమంత్రి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story