- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ విజయం .. మోదీపై విశ్వాసానికి ప్రతీక
ఢిల్లీలో బిజెపి విజయం ప్రధాని నరేంద్ర మోడీ పై విశ్వాసానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీలో బిజెపి విజయం ప్రధాని నరేంద్ర మోడీ పై విశ్వాసానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారనీ కొనియాడారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారునీ అన్నారు. నరేంద్ర మోదీ గారు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరాతయన్నారు. ఢిల్లీ అభివృద్ధికీ, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు ఉంది అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ గారిపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం అని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారు. హోం మంత్రి అమిత్ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొన్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు ఈ విజయంలో భాగస్వామ్యులైన వారందరికీ అభినందనలు తెలిపారు






