- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ బ్లాస్ట్ : ఏపీ హోం శాఖ అప్రమత్తం
ఢిల్లీ (Delhi) ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ (Delhi) ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తో దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ హోం శాఖ (AP Home Department) అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిఘా వ్యవస్థలను క్షేత్ర స్థాయిలో యాక్టివ్ చేసింది. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మాట్లాడుతూ ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. పేలుడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నామన్నారు. ఢిల్లీ పేలుడు దృష్ట్యా రాష్ట్రంలో పరిస్థితిపై పోలీసు (Police) ఉన్నతాధికారులతో మాట్లాడామన్నారు. తీర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. రద్దీఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. మెరైన్ పోలీసులు కూడా తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ, అనుమానితులు గా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.






