- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే కోడూరు రోడ్డులో గాయాలతో కనిపించిన జింక.. తిరుపతికి తరలింపు
by Ramesh Naini |
రైల్వే కోడూరు పట్టణ పరిధిలో ఓ జింక తీవ్ర గాయాలతో రోడ్డుపై కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రైల్వే కోడూరు పట్టణ పరిధిలో ఓ జింక తీవ్ర గాయాలతో రోడ్డుపై కనిపించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని ఎంజీ రోడ్డులో గాయాలపాలై నిస్సహాయ స్థితిలో పడి ఉన్న జింకను గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. లారీ పైనుంచి కింద పడటం వల్లే జింకకు ఈ తీవ్ర గాయాలు అయి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, గాయపడిన జింకను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం, సంరక్షణ నిమిత్తం జింకను తిరుపతికి తరలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అధికారులు వచ్చేంత వరకు జింకను స్థానికులు నీరు తాపించి.. సురక్షితంగా చూసుకున్నారు.
Next Story






