తీవ్ర విషాదం.. ‘ఇన్ స్టా’ ప్రేమ.. ఇద్దరు ఆత్మహత్య

by Jakkula.Mamatha |

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను యువత ఎంతగా వినియోగిస్తున్నారో అందరికీ తెలిసిందే.

తీవ్ర విషాదం.. ‘ఇన్ స్టా’ ప్రేమ.. ఇద్దరు ఆత్మహత్య
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాను యువత ఎంతగా వినియోగిస్తున్నారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా నేటి తరం యువత పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇటీవల జరిగిన సంఘటనలే నిదర్శనం. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో తెలియని లేని వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. దీంతో యువతులతో స్నేహం పేరుతో పరిచయమై అనంతరం ప్రేమ అంటూ వెంటబడుతుంటారు. ఇలా ముఖ పరిచయం లేని వ్యక్తులతో ప్రేమలో పడి యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు.

ఈ క్రమంలో సోషల్ మీడియా(Social Media) ప్రేమలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వెలుగు చూసింది. రాష్ట్రంలోని శ్రీకాళహస్తి వాసి సురేష్, విశాఖకు చెందిన వివాహిత పద్మకు ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ(Instagram Love)గా మారింది. దీంతో ఆమె తన భర్త, పిల్లలను విడిచి శ్రీకాళహస్తికి వచ్చి ప్రేమించిన సురేష్‌తో కలిసి ఉంటోంది. కానీ.. కొన్ని రోజులకే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో పద్మ ఉరి వేసుకుని చనిపోయింది. భయంతో సురేష్ కూడా విషం తాగాడు. మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు.

Next Story