తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం.. మాజీ సీఎస్ బి.రామారావు కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-15 06:03:27  IST  )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి బి.రామారావు కన్నుమూశారు.

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం.. మాజీ సీఎస్ బి.రామారావు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మోస్ట్ సీనియర్ ఐఏఎస్ బి.రామారావు (88) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బి.రామారావు దివంగత సీఎం నందమూరి తారక రామారావు (NTR) హయాంలో సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను గాడిలో పెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1958 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. కఠినమైన క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన అధికారిగా బ్యూరోక్రసీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. రామారావు మృతి పరిపాలనా రంగానికి తీరని లోటని పలువురు మాజీ సహచర అధికారులు గుర్తుచేసుకుంటున్నారు. అంత్యక్రియలు బెంగళూరులోనే నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story