- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. గోదావరిలో గల్లంతైన ఐదుగురు మృతి
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో గల్లంతైన ముగ్గురు మత్య్సకారులూ మృతి చెందారు. స్థానిక మత్స్యకారులు శనివారం గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. ..

దిశ, వెబ్ డెస్క్: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో గల్లంతైన ముగ్గురు మత్య్సకారులూ మృతి చెందారు. స్థానిక మత్స్యకారులు శనివారం గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లారు. అయితే ప్రమాదవత్తు గోదావరిలో గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు నీటిలో కొట్టుకుపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ముగ్గురు కూడా మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన రమేష్ ఊకె (38), భారతి తుర్రం (40), లక్ష్మి ఉయిక (37), ఉయిక సుశీల (37), బాలరాజు బసిపోయిన (40)గా గుర్తించారు. ఐదుగురు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు.ఈ ఘటనతో గొమ్ము కొత్తగూడెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ప్రజలు వర్షాకాలంలో చేపల వేట లేదా ఇతర అవసరాల కోసం నీటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






