దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు

by Kodari Anjali |

"ఊరికి కీడు సోకింది" అనే ప్రచారంతో గ్రామ ప్రజలంతా ఇండ్లకు తాళాలు వేసి వనభోజనానికి వెళ్లిన ఘటనపై దిశ దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.

దిశ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామంలో గత వారం రోజుల క్రితం "ఊరికి కీడు సోకింది" అనే ప్రచారంతో గ్రామ ప్రజలంతా ఇండ్లకు తాళాలు వేసి వనభోజనానికి వెళ్లిన ఘటనపై దిశ దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ వార్త వెలువడిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డా. ప్రభుదాస్ ఆధ్వర్యంలో గురువారం ఆబాది జమ్మికుంట గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో గ్రామ ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జ్వరాలు, దగ్గు, చర్మ సమస్యలతో వచ్చిన వారికి చికిత్స అందించారు. అధికారులు మాట్లాడుతూ.. ఊరికి ఎలాంటి కీడు లేదని, అపోహలు నమ్మొద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఊరు కౌన్సిలర్లు ఎగిత సుజాత అశోక్, మైసా శిరీష రవి చొరవ చూపి వైద్య శిబిరం ఏర్పాటుకు సహకరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటి పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పించారు.

Next Story