- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి బ్రిడ్జిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

దిశ, ఖానాపూర్ :- నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామ సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖానాపూర్ నుండి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు TS 21T0589, మెట్పల్లి నుంచి ఖానాపూర్ కు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు AP15Z 0101 నెంబర్ గల ఆర్టీసీ వాహనాలు గోదావరి బ్రిడ్జిపై ఎదురెదురుగా వచ్చాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా రెండు బస్సులు ఢీకొన్నాయి. ఢీకొన్న దెబ్బకు ఒక బస్సు విండ్ స్క్రీన్ పూర్తిగా ధ్వంసమైంది. బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొందరికి తల, చేతులకు గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన ప్రయాణికులను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. తర్వాత పోలీసులు వాహనాలను పక్కకు తొలగించడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ప్రమాదం తీవ్రత దృష్ట్యా పెద్ద ప్రాణనష్టం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.






