మచిలీపట్నం టు గుంటూరు.. క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి : జగన్ డిమాండ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-01 07:38:06  IST  )

మచిలీపట్నం టు గుంటూరు.. క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి : జగన్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంపై తమ ప్లాన్ -A ఫలించలేదని, ప్లాన్ -B ఏంటో కూడా అందరికీ తెలుసన్నారు. ఈ సందర్భంగా ప్లాన్ -B ప్రతిపాదనను జగన్ మీడియాకు తెలిపారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ రాజధాని ఏరియాగా ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆ ప్రాంతానికి మావిగన్ అని పేరు పెట్టాలని కోరారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు ఉందని, మొత్తం 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉన్న ప్రాంతాన్ని మావిగన్ పేరుతో రాజధాని చేయాలని, మావిగన్ అంటే జగన్ గుర్తువస్తాడనుకుంటే వేరే పేరు పెట్టాలని సూచించారు. వైసీపీ అమరావతికే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. కానీ.. చంద్రబాబు నాయుడు 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నారా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ల ఫ్యామిలీలు మూడు ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీస్ చేస్తున్నారని విమర్శించారు.

Next Story