విషాదం.. దంపతుల ఆత్మహత్యాయత్నం: భర్త మృతి

by Vemula.Srinu Prasad |

అప్పుల ఊబిలో ఆశలు సమాధి అయ్యాయి... దంపతుల ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యాయి. ఈ ఘోరంలో భర్త మృతి చెందగా భార్య మృతువులో పోరాటం చేస్తోంది...

విషాదం.. దంపతుల ఆత్మహత్యాయత్నం: భర్త మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అప్పుల ఊబిలో ఆశలు సమాధి అయ్యాయి... దంపతుల ఆత్మహత్యాయత్నానికి కారణమయ్యాయి. ఈ ఘోరంలో భర్త మృతి చెందగా భార్య మృతువులో పోరాటం చేస్తోంది. ఈ విషాద ఘటన కడప జిల్లా గాలివీడులో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిపోయిన అప్పుల భారం తట్టుకోలేక దంపతులు ఆత్మహత్యే శరణ్యమని అనుకున్నారు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. ఈ ప్రయత్నంలో భర్త మల్లికార్జున ప్రాణాలు కోల్పోయారు. భార్య ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది

ఆర్థిక సమస్యలతో సతమతం

మల్లికార్జున దంపతులు కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లోనే పురుగుల మందు తాగారు. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మల్లికార్జున మరణించగా, ఆయన భార్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం బాధితురాలిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సమాచారం అందుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story