- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇథలిన్ గ్లైకాల్ కలవడంతోనే పాలు కల్తీ: ల్యాబ్ రిపోర్ట్స్‌లో సంచలన విషయాలు
రాజమండ్రిలో సరఫరా చేసిన పాలలో ఇథలిన్ గ్లైకాల్ కలవడం వల్లనే కిడ్నీ ఫెయిల్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధితులు చనిపోయినట్లు ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో వెల్లడైంది.

దిశ, వెబ్ డెస్క్: కల్తీ పాలు(Adulterated Milk) తాగి అనారోగ్యానికి గురై రాజమండ్రి(Rajahmundry)లో ఇప్పటి వరకూ 10 మంది చనిపోయారు. మరో ఆరుగురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇందులో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. అయితే ఘటనా స్థలంలో పోలీసులు అక్కడ ఉన్న ఫ్రిజర్‌తో పాటు ఇతర పదార్ధాలను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపారు. ఈ మేరకు పరీక్షలు నిర్వహించిన నిపుణులు తాజాగా ల్యాబ్ రిపోర్టు అందజేశారు. దీంతో పాలలో ఇథలిన్ గ్లైకాల్(Ethylene glycol) కలిసినట్లు వెలుగులోకి వచ్చింది. తద్వారా కిడ్నీతో పాటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి బాధితులు చనిపోయినట్లు ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో వెల్లడైంది.
అయితే రాజమండ్రిలో పలు కాలనీల్లో పాలు సరఫరా చేసిన గణేష్ తప్పిదం వల్లనే కల్తీ జరిగినట్లు తెలుస్తోంది. పాలు నిల్వ ఉంచే ఫ్రిడ్జ్‌ను గత నెల 16న గణేష్ రిపేర్ చేయించారు. లీకైన కంటైనర్‌కు ఎంసీల్ అంటించారు. అయితే అంతకుముందు పాలు చేదుగా ఉన్నాయని గణేష్‌కి వినియోగదారులు చెప్పారు. అయినా సరే పాలను సరఫరా చేశారు. ఫ్రిజ్ నుంచి లీకైన రసాయనాలు కలవడం వల్లనే పాలు విషతుల్యంగా మారాయి. దీంతోనే ప్రమాదం జరిగిందని రిపోర్టులో తేలింది. ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా గణేష్‌పై అధికారులు చర్యలు తీసుకోనున్నారు.






