- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం బాణసంచా ఘటనల్లో పెరిగిన మృతుల సంఖ్యలు
రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం బాణసంచా ఘటనల్లో మృతుల సంఖ్య పెరిగింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరో వ్యక్తి మరణించాడు. చౌడేశ్వరి నగర్ కు చెందిన జి.సూర్యారావు (81) కల్తీపాలు తాగడంతో అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూర్యారావు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నిన్న కూడా ఒక వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నమోదైన మరణంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. ప్రస్తుతం ఇంకా 13 మంది కల్తీపాల బాధితులు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు.
వేట్లపాలెం ఘటనలో 23కి చేరిన మృతులు
మరోవైపు కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాద సమయంలో స్పాట్లోనే 20 మంది సజీవదహనం అవ్వగా.. పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఆ తర్వాత మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 22కి చేరింది. తాజాగా మరో వ్యక్తి మృతి చెందడంతో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేమగిరి లోవరాజు (38) మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. వేట్లపాలెం ఘటన మిగిల్చిన విషాదంలో పదులసంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భర్తలను కోల్పోయిన భార్యలు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు అనాధలయ్యారు. బాధితుల ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల చెక్కులను అందజేసింది.






