కల్తీ పాల ఘటనలో విషాదం.. చికిత్స పొందుతూ మూడేళ్ల బాలు మృతి

by Vemula.Srinu Prasad |

రాజమండ్రి కల్తీ పాల ఘటన లో మృతుల సంఖ్య పెరిగింది. ఘటన జరిగినా నాటి నుంచి మొత్తం 12 మంది మృతి చెందారు...

కల్తీ పాల ఘటనలో విషాదం.. చికిత్స పొందుతూ మూడేళ్ల బాలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రి కల్తీ పాల ఘటన(Rajahmundry adulterated milk incident)లో మృతుల సంఖ్య పెరిగింది. ఘటన జరిగినా నాటి నుంచి మొత్తం 12 మంది మృతి చెందారు. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మూడేళ్ల బాలుడు జయకృత్ రాజ్(Boy Jayakrit Raj) మృతి చెందారు. 25 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కల్తీ పాల వల్ల కిడ్నీతో పాటు వివిధ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవడం వల్ల బాలుడు మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనతో ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. తమ బాలుడు చనిపోవడంతో తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. కల్తీ కాటుకు తమ కుమారుడు బలి అయ్యాడని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Next Story