AP News : అన్ ఎయిడెడ్ స్కూళ్లకు సర్కార్ మరో ఛాన్స్

by Muthe.Rajitha |

అన్ ఎయిడెడ్ స్కూళ్లకు(Unaided Schools)సర్కార్ మరో ఛాన్స్ ఇచ్చింది.

AP News : అన్ ఎయిడెడ్ స్కూళ్లకు సర్కార్ మరో ఛాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : అన్ ఎయిడెడ్ స్కూళ్లకు(Unaided Schools)సర్కార్ మరో ఛాన్స్ ఇచ్చింది. ఏపీ(AP)లోని అన్ ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపు గడువును ఏపీ ప్రభుత్వం(AP Govt) మరోసారి పొడగించింది. ఈ మేరకు ఏపీ బాలల విద్యాహక్కు నిర్బంధ విద్యా నిబంధనలను సవరిస్తూ గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లకు జారీ చేసే గుర్తింపు గడువును 10 ఏళ్ళకు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సవరించిన ఉత్తర్వులను ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీ కోన శశిధర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఇదివరకు ఈ గుర్తింపు గడువు 8 ఏళ్లు ఉండగా.. ఇపుడు దానిని 10 ఏళ్ళకు పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి.

Next Story