Atrocious: ప్రయాణిస్తున్న డీసీఎం దగ్ధం..వీడియో వైరల్

by Disha Web Desk 9 |
Atrocious: ప్రయాణిస్తున్న డీసీఎం దగ్ధం..వీడియో వైరల్
X

దిశ వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా లోని కోడుమూరు మండలం లోని కొత్తూరు గ్రామ సమీపంలో రాత్రి డీసీఎం దగ్ధమైంది. బళ్ళారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై డీసీఎం దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం డ్రైవర్ ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు.

ఇక సమాచారం అందుకున్న కోడుమూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ వాహనం పూర్తిగా కాలిపోవడంతో 20 లక్షల దాకా ఆస్థి నష్టం వాటిల్లినట్లు వాహనదారుడు తెలిపారు.

Next Story

Most Viewed