- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొల్లేరు ఆక్రమణలపై సర్వే.. ఆ వివరాల పై DCM పవన్ కళ్యాణ్ ఆరా
కొల్లేరు(kolleru) ఆక్రమణలపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రత్యేక దృష్టి పెట్టింది.

దిశ,వెబ్‌డెస్క్: కొల్లేరు(kolleru) ఆక్రమణలపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు కొల్లేరు సరస్సు ఆక్రమణలపై అటవీశాఖ సర్వే ప్రారంభించింది. ఈ సర్వే(Forest Survey)లో భాగంగా గుడివాకలంక(gudiwakalanka) నుంచి డ్రోన్ల సహాయంతో ఆక్రమణలను గుర్తిస్తోంది. కొల్లేరు సరస్సు (kolleru lake)లో సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకొని వన్యప్రాణుల మనుగడకు ప్రమాదకరమైన ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతేడాది డిసెంబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులను గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలను అటవీ శాఖ ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సర్వే(Forest Survey) వివరాల పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఆరా తీస్తున్నారు.






