- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Davos Tour: ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు బృందం భేటీ
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఇన్‌వెస్ట్ ఏపీ(Invest AP) నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) దావోస్ పర్యటకు(Davos Tour) వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఇన్‌వెస్ట్ ఏపీ(Invest AP) నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) దావోస్ పర్యటకు(Davos Tour) వెళ్లారు. ఇందులో భాగంగా ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్(Lakshmi Mittal) తో భేటీ అయ్యారు. ఈ భేటీలో లక్ష్మీమిట్టల్, ఆదిత్య మిట్టల్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్, ఏపీ ఈడీబీ సీఇఓ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అన్నీ అవకాశాలు ఉన్నాయని ఇన్ వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని వారిని కోరారు.
అలాగే భావనపాడు(Bhavanapadu)లో పెట్రో కెమికల్ హబ్(Petro Chemical Hub) ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని మంత్రి లోకేష్ చెప్పారు. అంతేగాక ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. హెచ్‌పీసీఎల్ – మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ HMEL - HPCL-మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యాన రూ.3,500 కోట్లతో భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీ ప్రతిపాదన పట్ల మిట్టల్ సానుకూలంగా స్పందించారు.
అయితే ఈ సమావేశంపై సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో ఆయన.. ఇవాళ దావోస్ లో ఏఎమ్ఎన్ఎస్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్(Adithya Mittal) తో భేటీ అయినట్లు తెలిపారు. ఆర్సెలార్ మిట్టల్/నిప్పాన్ స్టీల్ ఇటీవల అనకాపల్లి(Anakapalli)లో 17.8 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్(Integrated Steel Project) కోసం రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిందని, ఇది అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని వివరించినట్లు సీఎం రాసుకొచ్చారు.






