- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ఘటన.. ప్రేమ పెళ్లికి వద్దన్న పేరెంట్స్.. ప్రియుడితో అలా చేయించిన కూతురు!
రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో చాలా మంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో పారిపోయి పెళ్లి చేసుకోవడం లేదా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవడం వంటివి చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక కొంతమంది అయితే పెద్దలు అంగీకరించకపోతే ఇద్దరు అర్థం చేసుకొని విడిపోయి.. పేరెంట్స్ చూసిన పెళ్లి చేసుకుంటారు.
కానీ.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని గుంటూరు జిల్లా(Guntur District)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి చేసిన పనికి పోలీసులు, ఆమె పేరెంట్స్ షాక్ తిన్నారు. ఆ యువతి తల్లిదండ్రులు ఆమె పెళ్లి కోసమని బంగారు ఆభరణాలను ఇంట్లో భద్రపరిచారు. కానీ, తమ కూతురు ఒక యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో తను ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి చేయాలని ఆమె పేరెంట్స్‌ని కోరింది. కానీ వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని పెళ్లి కోసం చేయించిన బంగారు ఆభరణాలను మాయం చేయాలని ప్లాన్ వేసింది.
ఈ క్రమంలో పేరెంట్స్ ఊరు వెళ్లిన సమయంలో తన ప్రియుడికి అన్ని విషయాలు చెప్పి ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీ చేయించింది. ఎవరికీ అనుమానం రాలేదు. బంగారు అభరణాలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. ఆ యువతి ఫోన్ కాల్స్‌పై అనుమానం వచ్చింది. దీంతో అసలు విషయం బయటపడింది. సదరు యువతి తన ప్రియుడితోనే ఇంట్లోని బంగారాన్ని చోరీ చేయించింది. ఈ క్రమంలో పోలీసులు యువకుడి ఇంట్లో ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.






