- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భక్తులకు అలర్ట్.. ఫిబ్రవరి 17న దర్శనాలు నిలిపివేత
నవనారసింహులు కొలువై ఉండే అహోబిలం లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో 17న దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఆలయ సీఏఓ ప్రకటన విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో అహోబిలం ఒకటి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం పుణ్యక్షేత్రంలో నవనారసింహులు కొలువై ఉంటారు. అడుగడుగునా అక్కడి వాతావరణం ఆహ్లాదపరుస్తుంది. ఒక్కరోజు ఈ క్షేత్రంలో గడిపినా.. పుణ్యం కలుగుతుందనేది భక్తుల నమ్మకం. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీన దర్శనాలను నిలిపివేయనున్నట్లు ఆలయ సీఏఓ రామానుజన్ వెల్లడించారు. ఫిబ్రవరి 20 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. 17న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. అందుకు భక్తులు సహకరించాలని కోరారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా.. గర్భగుడిలో సుంగంధ ద్రవ్యాలతో శుద్ధి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.






