Breaking News:ఫార్మాసిటీలో ప్రమాదం.. విషవాయువులు లీక్

by Jakkula.Mamatha |

పరవాడ ఫార్మాసిటీ(Paravada Pharmacy)లో ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.

Breaking News:ఫార్మాసిటీలో ప్రమాదం.. విషవాయువులు లీక్
X

దిశ,వెబ్‌డెస్క్: పరవాడ ఫార్మాసిటీ(Paravada Pharmacy)లో ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ విష వాయువులు లీక్‌ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు(శనివారం) అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి(Contract Employee) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రి(Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషవాయువులు లీకవడంతో వాటిని అదుపు చేసేందుకు యాజమన్యం ప్రయత్నిస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story