- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rain Effect: రేపే రైతులకు నష్టపరిహారం
అకాల వర్షాలతో కొన్ని జిల్లాలో జరిగిన నష్టంపై రేపటి కల్లా అంచనాలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు.

అకాల వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష
రెండురోజుల్లో పరిహారం చెల్లించాలని ఆదేశం
కొంతమంది రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం
రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం..
సమీక్ష వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారధి
దిశ, డైనమిక్ బ్యూరో : అకాల వర్షాలతో కొన్ని జిల్లాలో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం రేపు సాయంత్రానికి అందించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారు. అధిక వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లతో మాట్లాడి నష్టం అంచనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రమే ప్రాణనష్టం, పశునష్టం జరిగినట్లు కలెక్టర్లు వివరించారు. రేపటి కల్లా పరిహారం అందించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. రావాల్సిన పంట కంటే అదనంగా వస్తే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అకాల వర్షాలు, పిడుగులకు సంబంధించి ప్రజలకు వెంటనే సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పిడుగుపాటుకు చనిపోయిన 8 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం కూడా తక్షణమే అందించాలని ఆదేశించారు. విపత్తుల సమయాల్లో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. అకాల వర్షాలపైనా కొంతమంది రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రాడుయేట్లకు స్కిల్‌టెస్టు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకొస్తుందని మంత్రి పార్థసారధి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రభుత్వ సేవలు, పథకాలపై ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష గురించి మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని గ్రాడ్యుయేట్స్అందరికీ ఒక స్కిల్‌టెస్ట్(Skill Tesrt) జరిపి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. సచివాలయాల వద్దే ఈ టెస్టును నిర్వహిస్తామని వెల్లడించారు. స్కిల్స్అవసరమైన వారికి శిక్షణ అందిస్తామని వెల్లడించారు.
ప్రజల సంతృప్తి ప్రధానం
నాయకుడి సంతృప్తి అనే ఆలోచనపై గత ప్రభుత్వం పనిచేస్తే కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి పార్థసారధి తెలిపారు. పథకాలను అందుకున్న ప్రజల సంతృప్తి ఎలా ఉంది, అధికారులపై ఏమైనా ఆరోపణలు ఉన్నాయనే విషయాలపై ఐవీఆర్‌ఎస్‌ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. దానిని ఇవాళ సమీక్షలో విశ్లేషించారని పేర్కొన్నారు. పింఛను పథకంపై పరిశీలించగా ప్రజల్లో సంతృప్తి పెరుగుతోందని తెలిపారు. ఇక ఈ ఏడాది జనవరి 13 నుంచి ఏప్రిల్25 వరకు వాట్సప్గవర్నెన్స్లో 73.1 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దానిలో 36.38 లక్షల దరఖాస్తులకు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. వారానికి దాదాపు 7 లక్షల దరఖాస్తులు వస్తున్నట్లు మంత్రి పార్థసారధి వివరించారు.






