Daggupati: మేమిద్దరం కలసిపోయాం! ఎటువంటి భేషజాలు లేవు: చంద్రబాబుతో వైరంపై దగ్గుపాటి క్లారిటీ

by Thanuru Gopichand |

చంద్రబాబుకు తనకు కు మధ్య ఏదేదో ఉందని రాస్తుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు! ఉన్న మాట వాస్తవమే

Daggupati: మేమిద్దరం కలసిపోయాం! ఎటువంటి భేషజాలు లేవు: చంద్రబాబుతో వైరంపై దగ్గుపాటి క్లారిటీ
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: చంద్రబాబుకు (Chandrababu naidu) తనకు కు మధ్య ఏదేదో ఉందని రాస్తుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు! ఉన్న మాట వాస్తవమే కానీ, అదే జీవితం కాదు! అది గతం! మేమిద్దరం కలసిపోయాం! ఎటువంటి భేషజాలు లేవు!..’ అని అని డాక్టర్​దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggupati venkateswararao) తన వివరణ ఇచ్చారు. ‘అందరం మంచిగా ఉండాలి! అందరికి మంచి జరగాలి. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. సమస్యలను అధిగమించడమే జీవితం! ఆశాజనక భవిష్యత్ కోసం కలిశాం! అలా అని రాజకీయాల్లోకి(politics)ఏమీ రావడం లేదు. పుస్తకాలు రాసుకుంటూ బతికేస్తాను.. అని ఆయన మనసులోని మాటలు వెల్లడించారు. గురువారం విశాఖపట్నం (Visakhapatnam) గీతం యూనివర్సిటీ లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala seeraraman), పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు (Venkayyanidu), రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari), భరత్ పాల్గొన్నారు. ముందుగా రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం అనేక గ్రంథాలు అధ్యయనం చేసి ఈ ప్రపంచ చరిత్ర రాసినట్లు తెలిపారు. 30 ఏళ్ల తరువాత తన చేతిలోకి మైకు వచ్చిందని, అందుకే ఎక్కువ మాట్లాడుతున్నా అని వెంకటేశ్వరరావు నవ్వులు పూయించారు. మైక్ ఉందని కాదు గానీ, తనకు తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం ఇష్టం అని, కానీ, ఇవాళ ప్రముఖుల ముందు, మీ ముందు మాట్లాడే అవకాశం చాలకాలం తరువాత వచ్చిందని, అందుకే మనసులో మాటలు చెప్పుకుంటున్నా అని ఆయన అన్నారు.

ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రపంచ చరిత్ర రాశారు సంతోషం. భారతదేశ చరిత్ర వక్రీకరిణ జరిగింది, వాస్తవాలను పరిశోధించి భారత దేశ చరిత్ర రాయమని దగ్గుబాటి వెంకటేశ్వరావుకు సూచించారు. నిర్మల సీతారామన్ మాట్లాడుతూ గెలిచిన వాళ్ళు చరిత్ర సరిగ్గా రాయగలరని, ఓడిన వాళ్ళు వక్రీకరిస్తారని, చరిత్ర రాయడం చాలా క్లిష్టం అన్నారు. ప్రపంచ చరిత్ర వాస్తవాలను వెంకటేశ్వరరావు పూర్తిగా ఔపాసన చేసుకుని నిమగ్నమై స్పష్టంగా రాసారని, చదవాలనే ఆసక్తి పెంచారని అభినందించారు. దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చ లేని నేతగా రాణించి ఇప్పుడు రచయితగా కూడా విజయం సాధించారని వెంకటేశ్వరరావును అభినందించారు. ఈ సభలో తన పాత్ర ఏమిటో మా కుటుంబ సభ్యులను అడిగినా ఇంత వరకు చెప్పలేదన్నారు.

Next Story