పూరి గుడిసెలో పేలిన సిలిండర్

by Muthe.Rajitha |

తిరుపతి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.

పూరి గుడిసెలో పేలిన సిలిండర్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని నాయుడుపేటలోని లోతువానిగుంట కాలనీలో ఓ పూరి షార్ట్ సర్క్యూట్‌ కారణంగా గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించి ఇల్లు కలి బూడిద అయ్యింద. ఇంట్లో ఉన్నవారు గుడికి వెళ్లగా.. ఇంట్లో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న క్షణాల్లోనే ఆ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో ఫైర్‌ సిబ్బంది ఇంటి బయటే ఉండటం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అనంతరం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది.

Next Story